
CRIME: నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మటన్ బొక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్నందున బుధవారం రాత్రి మేస్త్రీలకు విందు ఏర్పాటు చేశాడు.
ఆ విందుకు తన పొరుగువారైన పోలేముని లక్ష్మయ్యను కూడా ఆహ్వానించాడు. లక్ష్మయ్య విందులో పాల్గొని మద్యం సేవించి మటన్ తింటుండగా, ఒక మటన్ బొక్క అనుకోకుండా గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడ ఉన్నవారు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అతడిని త్వరగా నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడి ప్రాణాలు నిలవలేకపోయాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ALSO READ: Crime: కట్నం కోసం వేధింపులు.. 6 నెలల బిడ్డను చంపి తల్లి సూసైడ్





