Homeఆంధ్ర ప్రదేశ్అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరిట అంబటి రాంబాబు మోసం చేశారు అంటూ అతనిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అంబటి రాంబాబును కస్టడీ కి ఇవ్వాలి అని తెలిపిన పోలీస్ పిటిషన్ ను కోర్టు తాజాగా తిరస్కరించింది. కాగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అసభ్యకరంగా దూషించినందుకు అలాగే పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను పోలీసులు అతనిపై పలు కేసులు కింద అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులలో ఇప్పటికే అతనికి బెయిల్ లభించింది. కానీ ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

పారుపల్లిలో తెలంగాణ జాతిపిత జన్మదినోత్సవం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం.. న్యూ అప్డేట్ ఇదే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments