 
						క్రైమ్ మిర్రర్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో: 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్లోనే చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ను దారుణ హత్య జరిగిన విషయం విదితమే, అయితే ఈ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు 6వ అదనపు జిల్లా కోర్టు (IX Additional District and Sessions Court) తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉండగా, 122 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగిలిన 16 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
దాదాపు పదేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు రాజకీయ విభేదాల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
శిక్ష పడినవారు (ఐదుగురు):
- ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1),
- ఎం.వెంకటాచలపతి (అలియాస్ వెంకటేష్),
- మంజునాథ్ (అలియాస్ మంజు),
- జయప్రకాష్ (అలియాస్ జయారెడ్డి),
- మునిరత్నం వెంకటేష్.
Also Read: చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారి పై దారుణం
Also Read: ఖమ్మం సీపీఎం సీనియర్ నేత దారుణ హత్య…
 
				 
					
 
						 
						




