
చౌటుప్పల్,క్రైమ్ మిర్రర్ :- మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ అనేది చాలా కీలకమైనదన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ననుసరించి ప్రాథమిక మరియు వివరనాత్మ కౌంటింగ్ నిర్వహించాలని , రూల్ 56 ప్రకారం మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించాలని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సిక్రేసి మెయింటెనెన్స్ యాక్టు చదివి మరియు కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ ఏజెంట్స్ కు చూపించి సక్రమంగా దానికి సంబంధించిన పీజియాన్ సీల్ ట్రే లో వేయాలని ముఖ్యంగా చాలా పారదర్శకంగా , బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. కౌంటింగ్ సిబ్బందికి తగు ముఖ్యమైన సూచనలు , సలహాలు జారీ చేశారు. కౌంటింగ్ లో ప్రతి టేబుల్ కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రకారం సక్రమంగా కౌంటింగ్ చేసి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కౌంటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Journalist Salma Murder Case: మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్డ అసలు కథ!









