Monday, February 16, 2026
Homeజాతీయంనా తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేకపోయా.. యూట్యూబ్ నా జీవితాన్ని మార్చేసింది!

నా తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేకపోయా.. యూట్యూబ్ నా జీవితాన్ని మార్చేసింది!

క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:-
ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూస్ సాధించినటువంటి వ్యక్తి గురించి చాలామందికి తెలుసు. అతను మరెవరో కాదు మిస్టర్ బీస్ట్. ఇతను చేసే వీడియోలకు సపరేట్ బేస్ ఉంటుంది. ఒకవైపు గేమ్స్ ఆడిస్తూనే ఆర్థిక సహాయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా విపరీతంగా ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా అతని చిన్ననాటి జ్ఞాపకాలను.. అసలు యూట్యూబర్ గా ఎందుకు మారారు అనేది తెలియజేశారు. యూట్యూబర్ గా మారడానికి ఒక బలమైన కారణం ఉందంటూ తెలిపాడు. 2008వ సంవత్సరంలో ఆర్థికంగా మా పేరెంట్స్ చాలా కృంగిపోయారు. చేతిలో ఒక రూపాయి కూడా లేదు అంటూనే.. ఆ సమయంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు. కేవలం నా తల్లిదండ్రులు సర్వం కోల్పోవడంతో నేను యూట్యూబ్ గా మారాల్సి వచ్చింది అని అన్నారు. వెంటనే youtube ద్వారా గేమింగ్ ఛానల్ ఓపెన్ చేశాను అని.. మా బంధువులు యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించవచ్చు అని చెప్పేసరికి.. చిన్న చిన్నగా నా వృత్తి యూట్యూబర్ అనుకుంటూ ముందుకు సాగాను అన్నారు. ఇది విన్న ప్రేక్షకులు సైతం మిస్టర్ బీస్ట్ ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా నెలకు కోట్ల రూపాయలలో మిస్టర్ బీస్ట్ కు ఆదాయం వస్తుంది.

దర్మం తప్పిన బీజేపీ: గెలిసింది ఒక్క స్థానం… చేతికి చైర్మన్ పదవి

ఎంపి కావ్యపై ఎన్నికల సంఘానికి పిర్యాదు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments