- అధికార దుర్వియోగంపై లోక యుక్తకు ఫిర్యాదు
- అర్వింద్ కుమార్‌పై విచారణ చేపట్టాలి
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: గతంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో హైదరాబాద్‌లో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాది ఇమ్మినేని రామరావు రాష్ట్ర లోకాయుక్తలో బుధవారం ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌పై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా అర్వింద్ కుమార్ హెచ్ ఎండీఏ కమిషనర్‌గా పని చేసిన సమయంలో పుప్పాల్‌గూడలోని కాందిశీకుల భూముల్లో 27 ఎకరాలను చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికు అక్రమంగా కట్టబెట్టారని న్యాయవాది ఇమ్మినేని రామరావు తెలిపారు.
ఈ భూముల బదలాయింపుల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అర్వింద్ కుమార్‌తో పాటు ఆయనకు సహకరించిన ఇంకా ఎవరైన ఉన్నారా అనేకోణంలో సమగ్ర విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిపారు.
ఫిర్యాదు స్వీకరించిన తెలంగాణ లోక్ యుక్తా వెంటనే ఈ అంశంపై నివేదిక సమర్పించాలని రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు. ఏప్రిల్ 16 లోపు సమగ్ర నివేదిక అందించాలని సూచించినట్లు తెలిపారు.
