
Corruption: ప్రపంచవ్యాప్తంగా అవినీతి అనేది ఏ దేశానికి ఉన్నా ఒక ప్రధాన సవాలు. ఇది కేవలం ఆర్థిక వ్యవస్థల మీదనే కాకుండా, ప్రజా వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తాజాగా, 2025లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, యుద్ధాలు, రాజకీయ అస్థిరత, బలహీన సంస్థల ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.
ఈ సంస్థ ప్రతి దేశంలో ఉన్న అవినీతి స్థాయిని నిపుణులు, వ్యాపారులు, సాధారణ ప్రజల అభిప్రాయాల ఆధారంగా అంచనా వేసి స్కోరు ఇస్తుంది. మొత్తం 180 దేశాలను ఈ సంస్థ రేంకింగ్ చేసింది. అవినీతి అత్యధికంగా ఉన్న దేశాలకు ‘0’ స్కోరు, అవినీతి రహిత దేశాలకు ‘100’ స్కోరు కేటాయిస్తుంది.
2024లో అత్యంత అవినీతి దేశంగా దక్షిణ సూడాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో 9 పాయింట్లతో సోమాలియా, 3వ స్థానంలో వెనిజువెలా, 10వ స్థానంలో ఉత్తర కొరియా చేరింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశం 38 పాయింట్లతో 96వ స్థానంలో కొనసాగుతుంది. గత కొన్ని సంవత్సరాల రిపోర్టులను చూసినట్లైతే భారత్ స్కోరు కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. 2023లో 38 పాయింట్లు, 2022లో 40 పాయింట్లు ఉండగా, 2024లో 38 పాయింట్లే నమోదయ్యాయి.
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వివరించిన దాని ప్రకారం.. 2012 తర్వాత కొన్ని 32 దేశాల్లో అవినీతి స్థాయిలలో మార్పు కనిపించినప్పటికీ, 148 దేశాల్లో పెద్దగా మార్పు కనబడలేదని పేర్కొంది. అంతేకాక, 2024లో ప్రపంచవ్యాప్తంగా చాలాదిక దేశాల్లో అవినీతి స్థాయిలు మరింత పెరిగినట్లు ఈ నివేదిక సూచిస్తోంది.
2025లో అత్యంత అవినీతి దేశాలు-టాప్ 10లు ఇలా..
1. దక్షిణ సూడాన్
2. సోమాలియా
3. వెనిజువెలా
4. సిరియా
5. యెమెన్
6. లిబియా
7. ఎరిట్రియా
8. ఈక్వటోరియల్ గినియా
9. సుడాన్
10. ఉత్తర కొరియా
ALSO READ: Shocking Video: పాములకు ఎలా ఆహారం ఇస్తారో తెలుసా?





