మంచిర్యాలలో కొర్రమీను క్లస్టర్, ప్రాసెసింగ్‌యూనిట్‌

హైద‌రాబాద్‌లో హోల్‌సేల్ చేప‌ల మార్కెట్‌

మంచిర్యాల‌, క్రైమ్ మిర్ర‌ర్ : తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లాలో కొర్ర‌మీను క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేయ‌నున్నట్లు లోక్‌స‌భ్‌లో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్‌‌ సింగ్ లోక్‌సభలో తెలిపారు.అదే విధంగా హైద‌రాబాద్‌లో అతిపెద్ద చేప‌ల హోల్‌సేల్ చేప‌ల మార్కెటు ఏర్పాటుకు కేంద్రం ప్ర‌క‌టించింది.

ఇవి అందుబాటులోకి వ‌స్తే అతి త‌క్కువ ధ‌ర‌కే చేప‌లు దొరుకుతాయి. నాలుగు ప‌ట్ట‌ణాల్లో ఫుడ్ స్ట్రీట్ల ఏర్పాకుచేయం నున్న‌ట్లు తెలిపారు. వ‌రంగ‌ల్ ఎంపీ క‌డియం కావ్య అడిగిన ప్ర‌శ్న‌కు ఆయన ప్రధాన మంత్రి మత్స్య యోజన కింద తెలంగాణలో రూ.196.80 కోట్ల విలువైన ప్రతి పాదనలకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు.

ఇక రాష్ట్రంలోని మరో నాలుగు పట్టణాల్లో హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రతాప రావు జాదవ్ ప్రకటించారు. హైదరాబాద్ శివారు నార్సింగి, వరంగల్, నల్లగొండ, సిద్దిపేటలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పెద్దపల్లి, మంచిర్యాలజిల్లాల్లోని పత్తి రైతుల కోసం సీసీఐ కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలోని చెరువులతో పాటు ఏపీ సముద్రతీరం నుంచి ఎక్కువగా చేపలు వస్తుంటాయి.

అయితే సుదూర ప్రాంతాల నుంచి చేపలు దిగుమతి చేసుకుంటుండటం వల్ల చేపల ధరలు ఎక్కువగా ఉంటున్నారు. అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లు అందుబాటులోకి వస్తే భోజన ప్రియులకు తక్కువ ధరకే చేపలు దొరకనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button