తెలంగాణ

టీబీజేపీ ఎంపీల విజయంపై వివాదం – ఓట్లు చోరీ చేశారంటున్న కాంగ్రెస్‌..!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో– : తెలంగాణలో బీజేపీ ఎంపీల విజయం వెనుక ఓట్ల చోరీ ఉందా..? కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత…? ఓట్లు చోరీ చేసుంటే బీజేపీ 8 సీట్లలోనే ఎందుకు గెలిచింది…? 17 సీట్లను ఎందుకు కైవశం చేసుకోలేకపోయింది…? దీని వెనుక వేరే లెక్కుందా…? ఢిల్లీలో మొదలైన ఓట్ల చోరీ వ్యవహారం… తెలంగాణలోనూ పొటికల్‌ హీట్‌ రాజేస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Read also : బోర్ కొడితేనే.. రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మొహమ్మద్ షమీ?

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఓట్ల చోరీపై ఉద్యమం చేస్తోంది. మోడీ సర్కార్‌పై విరుచుకుపడుతోంది. రాహుల్‌ గాంధీ బిహార్‌లో ఓటర్‌ అధికార యాత్ర కూడా చేస్తున్నారు. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు రాహుల్‌ గాంధీ. దీనిపై దేశమంతా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ఓట్ల చోరీ జరిగిందంటూ… కాంగ్రెస్‌ వాదిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌.. తెలంగాణలో 8మంది బీజేపీ ఎంపీల విజయం వెనుక ఓట్ల చోరీ ఉందంటూ ఆరోపించారు. బండి సంజయ్‌ కూడా దొంగ ఓట్లతోనే విజయం సాధించారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ బయటపెట్టిన ఆధారాలు చూస్తుంటే.. తెలంగాణలో కూడా అదే జరిగింద్న అనుమానాలు ఉన్నాయంటున్నారు మహేష్‌కుమార్‌ గౌడ్‌.

Read also : భారీ వర్షాలపై స్పందించిన కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులకు కీలక సూచనలు!

కాంగ్రెస్‌ ఆరోపణలకు గట్టి కౌంటర్‌ ఇస్తోంది బీజేపీ. తెలంగాణలో ఓట్ల చోరీ జరిగిందంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఓట్ల చోరీ కాదు.. రాహుల్‌ గాంధీ బ్రెయిన్‌ చోరీ అయ్యిందంటూ సెటైర్‌ వేశారాయన. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా ఓట్ల చోరీ ఆరోపణలను ఖండించారు. 30ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న తనను.. వార్డు మెంబర్‌ కానివాళ్లు కూడా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. తెలంగాణ ప్రజలను అమానిస్తున్నారని కౌంటర్‌ ఇచ్చారు.

తెలంగాణ బీజేపీ ఎంపీల విజయం వెనుక ఓట్ల చోరీ జరిగిందన్న కాంగ్రెస్‌ విమర్శల వెనుక.. ఎక్కడో లాజిక్‌ మిస్సవుతుందని.. కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఓట్లు చోరీ చేసి గెలిచుంటే… 17 సీట్లోనూ విజయం సాధించి ఉండాలని కదా.. 8 సీట్లలోనే ఎందుకు గెలిచారు అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరో వాదన కూడా ఉంది. 17కు 17 ఎంపీ సీట్లు గెలిస్తే… అనుమానాలు ఎక్కువగా వస్తాయి గనుక… 8 సీట్లను టార్గెట్‌ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా… ఓట్ల చోరీ లొల్లి… ఢిల్లీ నుంచి తెలంగానకు వరకు వచ్చేసింది.

Read also : భారీ వర్షాలపై స్పందించిన కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులకు కీలక సూచనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button