
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :-మునుగోడు మండలములోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి వెదిరే పూలమ్మ ఫౌండేషన్ కృషి చేస్తుంది..పాఠశాలలో అదనంగా ఉన్న రెండు గదులను పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి అనుకూలంగా వెదిరే పూలమ్మ ఫౌండేషన్ 90 వేల రూపాయలు,గోలి అనిల్ కుటుంబసభ్యులు 10 వేల రూపాయలు .మొత్తం 1 లక్ష రూపాయలతో డైనింగ్ హాల్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు..వెదిరే విజేందర్ రెడ్డి సమక్షంలో వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మెన్ వెదిరే మేఘారెడ్డి ,ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో యుగంధర్ రెడ్డి,సూపర్ఇండెంట్ విజయభాస్కర్ లు విద్యార్ధులతో కలిసి ప్రారంభించారు..ఈ సందర్భంగా విద్యార్దులు ఆనందం వ్యక్తం చేశారు.ఎంపిడిఓ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సేవలు అభినందనీయం అన్నారు ..సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ,సెక్రెటరీ స్వామి,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మొగుదాల శ్యామల,ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు బాలరాజు,వార్డు సభ్యులు జీడిమడ్ల మౌనిక,బోయపర్తి ప్రసాద్, సూర సురేష్,,గ్రామస్థులు మల్లేష్,దశరథ, సంకు శంకర్,బోయపర్తి గణేష్,సైదులు,అలివేలు, గ్రామస్థులు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Read also :-
Abhishek Sharma: కొత్త గెటప్‌లో కనిపించిన భారత స్టార్ ఓపెనర్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్
Arijit Singh: ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన బాలీవుడ్ సింగర్





