Homeతెలంగాణదర్మం తప్పిన బీజేపీ: గెలిసింది ఒక్క స్థానం... చేతికి చైర్మన్ పదవి

దర్మం తప్పిన బీజేపీ: గెలిసింది ఒక్క స్థానం… చేతికి చైర్మన్ పదవి

  • కాంగ్రెస్ గెలిసింది ఒక్క స్థానం అయినా చేతికి చైర్మన్ పదవి

  • బీఆర్ఎస్-8,బీజేపీ -6,కాంగ్రెస్-1

  • దర్మం తప్పిన బీజేపీ అభ్యర్థులు

  • ఆమనగల్ లో మారిన రాజకీయ సమీకరణాలు

  • రాబోయే రోజుల్లో ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయో

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి: ఆమనగల్లు పట్టణంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ చైర్మన్ పదవి తమదేనని ధీమాగా ఉన్నా, అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో అధికార సమీకరణాలు కాంగ్రెస్ వైపు మళ్లాయి. బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన పత్య నాయక్ ఆకస్మికంగా పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరడం ఈ పరిణామాలకు దారితీసింది.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచాయి. ఈ సంఖ్యాబలం దృష్ట్యా బీఆర్ఎస్‌కే చైర్మన్ పదవి ఖాయమని స్థానికంగా చర్చ జరిగింది. అయితే పత్య నాయక్, ఎంపీ మల్లురవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పరిస్థితి మారిపోయింది. పత్య నాయక్ చేరికతో కాంగ్రెస్ సంఖ్య 02 కి చేరింది.

అయితే ఒక్క పరిణామం తో బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయాల్లో బీజేపీ కి డిప్యూటీ ఛైర్మెన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం తో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. దింతో ఒక్కసారిగా ఆమనగల్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. తద్వారా మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. వైస్ చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి సతీమణి తల్లోజు గీతను ఎన్నుకున్నారు. తతంగాగాన్ని బీఆర్ఎస్ శ్రేణులు గ్రహించలేక పోవడంతో వారికి నిరాశ మిగిలింది.

ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ మార్పుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పత్య నాయక్‌కు చెందిన ఆసుపత్రిపై ఆందోళనకారులు దాడి చేసి ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో పత్య నాయక్ గెలుపొందిన వార్డులో ప్రజలు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

పార్టీ మారడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని ఆరోపించారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలు ఆమనగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

Most Popular

Recent Comments