
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకవైపు నిరసనలు వ్యక్తం అవుతుంటే బీజేపీ నాయకులు మాత్రం అలాంటి నిరసనలలో నిజం లేదని దుష్ప్రచారాల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారని అంటున్నారు. ఇదేక్రమంలో.. ఉపాధిహమి పథకానికి పేరు మాత్రమే మారింది అని పథకంలో ఎలాంటి మార్పులు జరగలేదని బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read also : గిల్, కోహ్లీకి చాలా తేడా ఉంది : ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్
ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, మారింది పేరు మాత్రమే అని, ఉపాధి హామీ పథకం కాదు అని, ప్రధానమంత్రి నరేంద్రమోది ఉపాధి హామీ పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచారాని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతనం 100 నుంచి 150 రూపాయలు మాత్రమే వుండేదాని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని రెట్టింపు చేసి సుమారు 300 రూపాయలకు పెంచిదని, ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో ప్రజలలో బీజేపీ పై పెరుగుతున్న ఆదరణ చూసే కాంగ్రెస్ నాయకులు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు ఆరు గ్యారెంటీ ల పేరుతో గద్దె నెక్కి, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, తెలంగాణాలో కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే ఈరోజు ప్రజలను తప్పుతోవ పట్టించడానికే,ఈ పథకం పేరును అడ్డు పెట్టుకొని బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
Read also : మస్కిటో కాయిల్ కారణంగా తొమ్మిదేళ్లు బాలుడు మృతి?





