Saturday, February 21, 2026
Homeతెలంగాణరాబోయే జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి : జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

రాబోయే జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి : జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం శుక్రవారం రోజున మండల కేంద్రంలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా మహిళ ముఖ్య కార్యకర్తల సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీత రావు ఆదేశాల మేరకు నెలవారి జిల్లా రివ్యూ మీటింగ్ కు జిల్లా ఇన్చార్జ్ అల్లురి కృష్ణవేణి రావడం జరిగింది.జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లను, కౌన్సిలర్లను పెద్ద ఎత్తున గెలిపించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారని హర్షం వ్యక్తం చేశారు.

రాబోయే జడ్పిటిసి,ఎంపిటిసి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దదని అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ పథకాలను చేరవేయాలని దిశా నిర్దేశం చేశారు. మహిళా కమిటీలన్నీ త్వరలో పూర్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంతన్న ప్రభుత్వంలో ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని, బిజెపి,బిఆర్ఎస్,అరాచకాలను తిప్పికొట్టాలని నీలం పద్మ అన్నారు.అలాగే ఇందిరా ప్రియదర్శిని సానిటరీని బాలికలకు మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెసు అధ్యక్షురాలు సుధారాణి, మండల పార్టీ అధ్యక్షురాలు డి.నవ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం వినోద, భువనగిరి పట్టణ అధ్యక్షురాలు కవిత,మమత, భ్రమరాంబ, వెంకటమ్మ,అనిత,స్థానిక వార్డ్ మెంబర్లు నోములు రజిత,రంగ సంధ్య,సభ్యులు ఇంద్రజ,ఉమా, కావ్య మొదలగువారు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments