•చైర్మన్గా బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్గా ఆంజనేయులు
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా. ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ గా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని ఆర్డీఓ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి ప్రమాణం చేయించారు. నూతన మున్సిపాలిటీ పాలక వర్గం మాట్లాడుతూ ఆలేరు పట్టణాభివృద్ధికి ప్రధాన్యతను ఇస్తామని మాపై నమ్మకం ఉంచిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డిసిసి అధ్యక్షులు బీర్ల ఐలయ్య మరియు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్,మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఎంఏ ఏజాస్, ఎండీ బాబా,తదితర నాయకులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట,ఆలేరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
సింగారంలో ఎస్సీ కాలనీ వాసులకు టెంట్ హౌస్ ను అందజేసిన ఝాన్సీ పురుషోత్తం రెడ్డి
