
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అని వెల్లడించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటుకు 5000 ఇస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 7000 ఇస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ మెడలే వంచాము.. కాంగ్రెస్ మేడలు కూడా బీజేపీ పార్టీ త్వరలోనే వంచుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలలో భాగంగా ప్రతి పార్టీ కూడా వారికి నచ్చినట్లు వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇలాంటి సందర్భంలో మీకు అభివృద్ధి కావాలో లేక అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే తెలుసుకోవాలి అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే 11వ తేదీన పోలింగ్ కారణంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు మరియు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక మరోవైపు మీరు ఓట్లు గుద్దే గుద్దుడుకు.. ముఖ్యమంత్రి కుర్చీ ఊగిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also : తప్పుడు కేసులు పెడితే వదిలేది లేదు.. మాజీ మంత్రి రజిని వార్నింగ్!
Read also : ఐపీఎల్ నుంచి బిగ్ అప్డేట్.. వచ్చే నెలలోనే మినీ వేలం!





