తెలంగాణ

3 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు.. సీఎం రేవంత్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి రాగం పెరిగిపోతోంది. ఇప్పటికే మంత్రుల మధ్య వార్ తో పాలన ఆగమాగంగా మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు పట్టించుకోవడం లేదనే టాక్ వస్తోంది. రేవంత్ కు అనుకూలంగా ఉండే ప్రధాన పత్రికలోనే మంత్రులు ఆయనను అస్సులు పట్టించుకోవడం లేదనే వార్త రావడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ కావాలనే అలా కథనం రాయించుకున్నారని మంత్రులు కుతకుతలాడుతున్నారు.

తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేశాడు. రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన కామెంట్లు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. 20 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చారని.. అవన్ని ఏం చేశారని నిలదీశారు. లక్ష, రెండు లక్షల రూపాయల పనులకు కూడా తమ దగ్గర నిధులు లేవన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి.
ఎమ్మెల్యేలుగా తమ పరిస్థితి చెప్పుకోలేకుండా దారుణంగా ఉందని కామెంట్ చేశారు.

డబ్బులు ఎందుకు లేవు? లక్షల కోట్లు అప్పు తేవట్లేదా అని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి, పేరంటానికి పోవుడు తప్ప మేం చేసేది ఏం లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో అప్పులు తెచ్చినా.. వాళ్లు చేసిన పనులు కనిపిస్తున్నాయని… కాని గత 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు ఎక్కడ కనిపించడం లేదంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు గాంధీభవన్ లో దుమారం రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button