తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే కొనసాగుతోంది.ప్రభుత్వం నియమించిన దాదాపు 80 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అయితే సర్వే ఆశించిన మేర సాగడం లేదని తెలుస్తోంది. కులగణన సర్వే పట్ల ప్రజలు ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. ప్రబుత్వం కూడా సరైన ప్రచారం చేయకపోవడంతో సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. దీంతో సర్వేలో సరైన సమారం ఇవ్వడం లేదు జనాలు. దీంతో సర్వే తూతూమంత్రంగా సాగుతుందనే చర్చ సాగుతోంది.
సర్వేకు వెళుతున్న సిబ్బందికి చీత్కారాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. ఆ విషయంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కులగణన సర్వే సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి టిఎస్ యుటిఎఫ్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే నిర్వహణపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఉపముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా సర్వే విధులు కేటాయించారని టిఎస్ యుటిఎఫ్ నేతలు ఆరోపంచారు. కేవలం ప్రాథమిక ఉపాధ్యాయులను మాత్రమే ఎన్యూమరేటర్లుగా నియమించారని.. వారిని మధ్యాహ్నం 1.00 వరకు పాఠశాల నిర్వహించి, విద్యార్థులకు మధ్యాహ్నభోజనం వడ్డించిన తర్వాత మాత్రమే సర్వేకు వెళ్ళాలని ఆదేశించారని.. అయితే సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు జరగడం లేదని చెప్పారు.
కొందరు జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి తీవ్రమైన వత్తిడి కలిగిస్తున్నారని యూటీఎఫ్ నేతలు చెప్పారు. క్రమశిక్షణా చర్యలు, షోకాజ్ నోటీసులంటూ బెదిరిస్తున్నారని… ఈ రకంగా ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తే సర్వే సక్రమంగా జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. సర్వేకు ప్రజలందరూ సహకరించేలా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలన్నారు. కొందరు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారని..మరికొందరు ఎన్యూమరేటర్లను అవమానిస్తున్నారని.. కొందరు సర్వేకు వచ్చిన సిబ్బందిపై కుక్కలను వదులుతున్నారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొందరు నేతలు సర్వేకు వచ్చిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ హామీలపై నిలదీయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం వైపునుండి తగిన ప్రోత్సాహం ఉండాలన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ప్రణాళికా శాఖ అధికారులు జోక్యం చేసుకొని క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సర్వే సజావుగా సాగేలా చూడాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకి, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి లేఖలు రాశారు.
పరిష్కరించాల్సిన సమస్యలు..
1 ఎన్యూమరేటర్లందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
2 సర్వే చేయాల్సిన కుటుంబాల సంఖ్యను గరిష్ఠంగా 100 కే పరిమితం చేయాలి. (ప్రస్తుతం 150 నుండి 200 కుటుంబాలు కేటాయించారు)
ఎన్యూమరేటర్ల సంఖ్యను పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులను కూడా నియమించాలి. అవసరమైతే యుపి మరియు హైస్కూలు ఉపాధ్యాయులను కూడా వినియోగించుకోవాలి.
3. సర్వేకి కుటుంబానికి ఒక్కింటికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో వెల్లడించాలి.
4. సర్వే ప్రతి రోజు కనీసం 10, సెలవు దినాల్లో 20 కుటుంబాలను సర్వే చేయాలని టార్గెట్ పెడుతున్నారు. ఒక కుటుంబం సర్వే చేయటానికి 30 నుండి 40 నిమిషాల సమయం పడుతోంది కనుక టార్గెట్ పెట్టకుండా చూడాలి.
5. అత్యవసరం, అనారోగ్యం తదితర అత్యవసర కారణాలతో కూడా సిఎల్ వినియోగించడానికి వీల్లేదని ఎన్యూమరేటర్లను వేధిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క రోజు సర్వేలో పాల్గొనకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఉపాధ్యాయుల్లో ప్రతికూలతకు కారణమయ్యే ఇలాంటి చర్యలను మానుకోవాలి.
6. సర్వేకు ప్రజలందరూ సహకరించేలా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలి. కొందరు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. మరికొందరు ఎన్యూమరేటర్లను అవమానిస్తున్నారు. కొందరు కుక్కలను వదులుతున్నారని సమాచారం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.
రాజకీయ నాయకులు కొందరు ప్రభుత్వ హామీలపై సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లను నిలదీయమని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
7. ఎన్యూమరేటర్లతో గౌరవంగా వ్యవహరించాలి . సానుకూలంగా ప్రోత్సహిస్తూ సర్వే సజావుగా సాగేటట్లు చూడాలి.
మరిన్ని వార్తలు చదవండి ..
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి
టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్
20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ