సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులు ప్రధాని మోదీకి కంప్లైంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందంటూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని అభ్యర్థులు ఆరోపించారు.
రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు జీవో నెంబర్ 29ని అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ, ఎస్సి విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, వర్గీకరణ చేపట్టకుండా అక్రమంగా వ్యవహరిస్తోందని వాపోయారు. గ్రూప్ 1 పరీక్షకు మహిళా రిజర్వేషన్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రస్తావించారు. హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిని అధికారం, డబ్బుతో ప్రభావితం చేసి తీర్పును మార్చారని ఫిర్యాదులో సంచలన వ్యాఖ్యలు చేశారు.