
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక అధికార ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చాలానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా నేడు సక్సెస్ అయ్యింది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ రెండుసార్లు ఓడిపోయినప్పటికీ నవీన్ యాదవ్ కు ఉన్నటువంటి ఫాలోయింగ్ చూసి సీఎం రేవంత్ రెడ్డి నవీన్ కు మళ్ళీ టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. వాళ్ల ఓట్లు కీలకము కానున్నాయి కాబట్టే పోలింగ్కు ముందే హజారుద్దీన్ కు మంత్రి పదవి అనేది ఇచ్చారు. దీంతో మైనారిటీల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అలాగే పలు రోడ్ షోలలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించారు. ముఖ్యంగా తోటి కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపులో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అందుకే నేడు 25 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని నమోదు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ గెలుపుతో ఒకవైపు సంపురాలు చేసుకుంటూనే రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read also : Jubilee hills Election: బీఆర్ఎస్ భారీ ఓటమి.. అసలు కారణాలు ఏమిటి?
Read also : Interesting Facts: సాయంత్రం వేళల్లో ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందా?





