
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- త్వరలోనే ప్రపంచ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి మన భారతదేశానికి రానున్నారు. “GOAT INDIA TOUR 2025” లో భాగంగా స్టార్ ప్లేయర్ మెస్సి వచ్చే డిసెంబర్ నెలలో హైదరాబాదుకు రానున్నారు. అయితే మెస్సి రాకతో ఇప్పటికే అధికారులు అందరూ కూడా తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మెస్సి హైదరాబాదులో అడుగుపెట్టిన తరువాత అతనికి ఘనంగా ఆహ్వానం పలికే అవకాశం కూడా ఉంది. అయితే ఈ స్టార్ ప్లేయర్ మెస్సి తో హైదరాబాదులోనే సరదాగా, స్నేహపూర్వకంగా ఒక మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అని.. ఈ మ్యాచ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు వినగానే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతోపాటు కార్యకర్తలు అందరూ కూడా తెగ సంతోష పడిపోతున్నారు. మరోవైపు మన భారతదేశంలో కూడా ఈ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సికి చాలామంది అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా ఇతని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని.. అథ్లెటెక్లు కు పూర్తిస్థాయిలో మద్దతు అందిస్తామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ వెల్లడించారు. కాగా ప్రముఖ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్స్ క్రిస్టియానో రోనాల్డో మరియు మెస్సికి మన భారత దేశంలో కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. మెస్సి ఇండియాకు రావడం పట్ల చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also : ఏపీలో భారీ వర్షాలు.. అల్పపీడనమే కారణం.. ఈ జిల్లాలో అలర్ట్!
Read also : పెబ్బేరు లో ఘనంగా 14వ వార్షికోత్సవ శోభ యాత్ర





