
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన అభ్యర్థులందరూ కూడా నిన్న సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి సర్పంచ్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచులు, ఉప సర్పంచులు అలాగే వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రతి సోదర సోదరీమణులకు ఇవే నా శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ మంచి పాలన అందించి పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాకుండా మీరందరూ కూడా ప్రజల నుంచి ప్రశంసలు పొందేలా పనిచేయాలి అని సూచించారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా నియోజకవర్గాల్లో నా పంచాయితీనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండే విధంగా నూతన సర్పంచులు పాలన అందించాలి అని సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Read also : అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కృష్ణప్ప గౌతమ్!
Read also : ఆఫ్గాన్ వీధుల్లో నేను బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే తిరుగుతా : రషీద్ ఖాన్





