తెలంగాణ

అల్లుడి కోసమే సీఎం రేవంత్ మూసీ డ్రామాలు!

మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలే అన్నారు బండి సంజయ్. లండన్, సీయోల్ కాదు మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్ అన్నారు. సబర్మతి, నమామి గంగ తో మూసీకి పోలికా?సబర్మతి, నమామి ఖర్చుకు, మూసి అంచనాకు పోలిక ఎక్కడ అని మండిపడ్డారు. మీ అల్లుడి కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కడిగిపారేశారు బండి సంజయ్.

కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తామని.. మూసీ బాధితులకు మేం అండగా ఉంటామని బండి సంజయ్ హెచ్చరించారు. పేదల పక్షాన కాంగ్రెస్ నేతలను నిలదీస్తామన్నారు. మూసీ బాధితులకు అండగా బిజెపి మహాధర్నాలో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.ఓసారి మూసీ సుందరీకరణ అని మరోసారి మూసీ పునరుజ్జీవం అంటున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన అనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలి అల్లుడి కోసం మాత్రమే అన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి పేదల ఇండ్లు ముఖ్యం కాదు. సోనియాగాంధీ అల్లుడికి సంబంధించిన కాంట్రాక్టుల కోసం మాత్రమేనని మండిపడ్డారు.

Read More : రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..హైదరాబాద్‌లో ఫుల్ ట్రాఫిక్ జాం

మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడికి నుంచి వస్తున్నయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు బండి సంజయ్. లక్షన్నర కోట్లతో ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ.. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు అని సెటైర్లు వేశారు బండి సంజయ్.
15 వేల ఇండ్లు కూలగొట్టి లక్షల మంది పేదల బతుకులను బజారుకీడ్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుని తీరుతామని బండి సంజయ్ ప్రకటించారు.

Read More News:

  1. రేవంత్ రెడ్డిపై పొంగులేటి బాంబ్ వేస్తాడేమో.. కేటీఆర్ సంచలన కామెంట్స్
  2. డబ్బుల్లేవ్.. డీఏలు ఇవ్వలేం.. ఉద్యోగుల ముందు చేతులెత్తేసిన సీఎం!
  3. కేసీ వేణుగోపాల్‌తో భట్టి మీటింగ్.. రేవంత్ శిబిరంలో టెన్షన్!
  4. దీపావళి కానుక.. ఒక్కో కార్మికునికి 3 లక్షల రూపాయలు
Back to top button