
-
రేవంత్‌తో పాటు ఢిల్లీలోనే ఉన్న ఐదుగురు తెలంగాణ మంత్రులు
-
ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సోమవారానికి వాయిదా
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్ల విషయమై అధిష్ఠానంతో చర్చల్లో పాల్గొంటూ, వరుస సమావేశాలతో ఉన్నారు. రేవంత్ సహా మరో ఐదుగురు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలోనే వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
కేబినెట్ భేటీ వాయిదా
సీఎం రేవంత్‌తో పాటు ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉండటంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. సోమవారం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి.
Read Also: