
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరు వైసీపీ కార్యాలయంలో పాల్గొని కూటమి నాయకుల పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం చంద్రబాబు లేదా లోకేష్ గురించి మాట్లాడొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం వృధా అంటూ అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు లేదా లోకేష్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ జీరో అని రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాల గురించి కూడా అంబటి రాంబాబు జోష్యం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చురుగ్గా లేరు అంటూనే… భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ లో ఈ చురుకుదనం కనిపించబోదు అని అఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటిన… చేతలు మాత్రం గడప కూడా దాటవు అని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంబటి రాంబాబు లోకేష్ రెడ్ గురించి మాట్లాడుతూ… ఆ బుక్ నా కుక్క కూడా లెక్కచేయదు అంటూ రెండు రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Read also : ఇకపై “సమంత నిడిమోరు”.. పేరు మార్చుకోనున్న సమంత?
Read also : Medaram: జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఆ విభేదాలే కారణమా..?





