
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ( బుధవారం) రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడినుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్ దంపతులు వెళుతున్నారు. ఈ పర్యటనలోనే ఈనెల 20న చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉండనున్నారు.
Also Read : జగన్‌కు సొంత పార్టీ నుంచే వెన్నుపోట్లు – టీడీపీతో కలిసి వైసీపీ ఓటమికి ప్లాన్లు
ఏటా ఒకసారి కుటుంబంతో కలిసి కొంత సమయం విదేశాల్లో గడిపే ఆనవాయితీ పాటిస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ష్‌తో గడిపేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నాలు మానవీయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఏప్రిల్ 17వ తేదీ ఉదయం ఒంటి గంటకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా పాల్గొంటారు. విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి ఏప్రిల్ 21వ తేదీ అర్ధరాత్రి అమరావతికి చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..