
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్మస్ వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇప్పటికే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవగా డిసెంబర్ 25వ తేదీన అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ ఈ పండుగను జరుపుకొనున్నారు. ఇప్పటినుంచి మేరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుగా తాజాగా కొన్ని దేశాల్లో మాత్రం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధమంట. మీరు విన్నది నిజమే.. ఉత్తర కొరియాలో క్రిస్మస్ జరుపుకుంటే కచ్చితంగా వారు కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో ఈ క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అనుమతి అనేది లేదు. ఇక సోమాలియా అనే దేశంలో క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ వేడుకలు కూడా నిషేధించారు. ఇక బ్రూనై మరియు తజకిస్తాన్ లో ముస్లిమేతర పరిమిషన్లు తీసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు అట. సౌదీలో మాత్రం బహిరంగ వేడుకలకు ప్రస్తుతానికి ఎటువంటి అనుమతులు లేవు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉండే క్రిస్టియన్లలో ఈ కొన్ని దేశాల్లో మాత్రం ఈ వేడుకలు జరుపుకోవడం నిషేధం. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక మన భారతదేశంలో ప్రతి ఒక్క పండుగ కూడా ఆయా మతాలవారు చాలా ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో ఏ మత పండుగకైనా నిషేధం అనేది లేదు. దీంతో అన్ని మతాలవారు వారి మతాలకు సంబంధించిన పండుగలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
Read also : భారీ స్థాయిలో బీజేపీ పార్టీకి విరాళాలు.. అత్యల్పంగా ఏ పార్టీకి అంటే?
Read also : బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడి.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!





