Homeఆంధ్ర ప్రదేశ్వాతావరణంలో మార్పులు.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు!

వాతావరణంలో మార్పులు.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల విపరీతమైన ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవడం కారణంగా వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని ప్రజలు సైతం కొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రెండు రోజులు ఎండలు మరో రెండు రోజులు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు జ్వరం, గొంతు నొప్పి మరియు దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని.. ఆస్పత్రిలో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని వైద్యులు చెబుతున్నారు.

వాతావరణం లో చోటు చేసుకుంటున్నా మార్పుల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని.. అత్యవసరమైతే తప్ప ఎండలోనూ లేదా వర్షంలోనూ బయట ప్రయాణాలు చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు. వీలైనంతవరకు అధిక ఉష్ణోగ్రత, వర్షపు సమయంలో బయటకు వెళ్ళకూడదు అని సలహాలు ఇస్తున్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్నటువంటి వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. వర్షపు సమయంలో ఆహారంతో పాటు కాచి చల్లార్చినటువంటి నీటిని తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దోమల నివారణకు పలు చర్యలు తీసుకుంటే వెంటనే వైరల్ ఫీవర్లు తగ్గు ముఖం పడతాయి అని చెబుతున్నారు. కాగా నిన్నటి రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచి కొట్టాయి. చాలా రోజుల తర్వాత వర్షాలు పడడంతో వ్యవసాయ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా పట్టణ ప్రాంత ప్రజలు కాస్త విశ్రాంతి పొందుతున్నారు.

మార్చిలో సెలవల “హోలీ”లు .. ఎన్ని రోజులంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు