Homeక్రైమ్చండూరు: లంచాల‌కు అడ్డాగా మారిన ఎంపీడీవో కార్యాల‌యం..?

చండూరు: లంచాల‌కు అడ్డాగా మారిన ఎంపీడీవో కార్యాల‌యం..?

  • స‌ర్పంచుల బిల్లులు చెల్లించాలంటే ఎంపీడీవో కార్యాల‌యంలో చేతులు త‌డ‌పాల్సిందే.. ?

  • లంచాల‌కు ప‌రాకాష్ఠగా మారిన చండూరు ఎంపీడీవో కార్యాల‌యం..?

చండూరు,క్రైమ్ మిర్ర‌ర్ః చండూరు ఎంపీడీవో కార్యాల‌యం లంచాల‌కు ప‌రాకాష్ఠ‌గా మారింద‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. అస‌లే గ్ర‌మా పంచాయితీల‌కు వ‌చ్చే నిధులు స‌క్ర‌మంగా రాక స‌మ‌స్య‌ల‌తో కూన‌రిల్లుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం 15 వ ఆర్థ‌క సంఘం నిధులు గ్ర‌మ పంచాయితీల‌కు ఊపిరి పోశాయి.

ఈ విష‌యం ఇలా ఉంటే. స‌ర్పంచులు గ్ర‌మ పంచాయితీల్లో ప‌నులు చేయించాక‌. ఎంబీ చేయించి ఎంపీడీవో కార్యాల‌యంకు వ‌స్తారు. ఆత‌ర్వాత కార్య‌ల‌యంలో ఉండే ఉద్యోగులు వాటిని సిస్ట‌మ్‌లో అప్‌లోడ్ చేసి చెక్కులు పాస్ చేయ‌టానికి కావ‌ల్సిన ప‌నిని పూర్తి చేస్తారు.

ఇక్క‌డే స‌ద‌రు ఉద్యోగుల‌కు చేతులు త‌డ‌పాల్సి వ‌స్తుంది అనే ఆరోప‌ణ‌లు స‌ర్పంచుల నుంచి వెలువ‌డుతున్నాయి. ఏ స‌ర్పంచి అయినా స‌రే బిల్లులు రావాలంటే ఎంపీడీవో కార్యాల‌యంలో ఓ ఉద్యోగి చేతులు త‌డ‌పాల్సిందే….?

ఇటీవ‌ల ఓ గ్రామ స‌ర్పంచి త‌న బిల్లులు పాస్ చేసినందుకు ఎంతో కొంత త‌న‌కు తోచినంత ఎమౌంట్‌ను స‌ద‌రు ఉద్యోగికి స‌మ‌ర్పించ‌గా….ఇంతేనా నాకు ఇచ్చేది అంటు ఆ ఎమౌంట్‌ను వాప‌స్ చేసి ఆ స‌ర్పంచికి బిల్లులు ఇవ్వ‌కుండా ముప్పు తిప్ప‌లు పెడుతున్నాడు.

స‌ద‌రు స‌ర్పంచి ఈ విష‌య‌మై ఉన్న‌త ఉద్యోగుల‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈయ‌నతో పాటు మ‌రికొంత మంది స‌ర్పంచులు సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

అస‌లు ఈ వ‌సూళ్ల భాగోతంలో ఒక్క ఉద్యోగి మాత్ర‌మే ఉండ‌ర‌ని ఇందులో కార్యాల‌యంలో ఉండే ఇత‌ర ఉద్యోగులు కూడా భాగ‌స్వామ్యంగా ఉంటార‌నే ఆరోప‌ణ‌లు సైతం ఉన్నాయి. ఈ విష‌య‌మై ఉన్న‌త అధికారులు ఇప్ప‌టికైన దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

ఈ విష‌య‌మై ఎంపీడీవో యాద‌గిరిని వివ‌ర‌ణ కోర‌గా టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి బిల్లులు రావ‌టంలో కొంత ఆల‌స్య అవుతుంద‌ని కాని త‌న కార్యాల‌యంలో బిల్లులు చెల్లించాలంటే డ‌బ్బులు అడుగుతున్నార‌నే ఫిర్యాదులు రాలేద‌ని ఇక‌పై ఈ విష‌యంపై దృష్టిసారిస్తాన‌ని తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు