-
14 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు
-
డిసెంబర్ 30, 2025 (మంగళవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని నోటీసులు జారీ
క్రైమ్ మిర్రర్ తెలంగాణా ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సినీ నటి మాధవీలతపై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. తాజా వివరాల ప్రకారం.. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందింది.
ఆమె తన పోస్టులలో సాయిబాబాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం అందింది. మాధవీలతతో పాటు ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రోత్సహించిన సుమారు 14 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు సమాచారం.
విచారణలో భాగంగా డిసెంబర్ 30, 2025 (మంగళవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకు ఆమె పోలీస్ స్టేషన్‌లో హాజరు అవుతార లేదా అనేది వేచి చూడాల్సిందే..





