
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఒత్తిళ్లు మరియు సమస్యల కారణంగా రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్ర పట్టక నానా తిప్పలు పడుతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా ఏదో ఒక సమస్య కారణంగా రాత్రి సమయాల్లో కూడా ఆ సమస్యల గురించే ఆలోచిస్తూ సరిగా నిద్ర కూడా పోరు. రాత్రి సమయంలో నిద్ర రావడం లేదు అని బాధపడేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా లేదా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా రాత్రిపూట సరైన నిద్ర పట్టాలంటే ఈ చిన్న చిట్కా పాటించాల్సిందే. ప్రతిరోజు కూడా అన్నం తిన్న తర్వాత పడుకునే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే కచ్చితంగా ప్రశాంతమైన నిద్ర వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. కేవలం గోరువెచ్చని పాలు తాగితేనే నిద్ర వస్తుంది అని నిపుణులు ఊరికే చెప్పడం లేదు. దానికి తగ్గ గల కారణాలు కూడా ఉన్నాయి. పాలలో ఉండేటువంటి ట్రిప్టో పాన్ అనే అమినోయాసిడ్ మెలటోనిన్ అనేది హార్మోన్ ఉత్పత్తి తినిపించి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు విటమిన్ D వంటి పోషకాలు ఒత్తిడి సమస్యను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఈ పాలలోనే పసుపు కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి సరైన నిద్ర కోసం వైద్య నిపుణులను కలిసి చర్చించడం చాలా అవసరం.
Read also : అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. నాగబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న mega ఫ్యాన్స్
Read also : యూరియా కోసం రైతుల ఇబ్బందులు…పోలీసుల పర్యవేక్షణలో పంపిణీ





