
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు లో గంజాయిని పట్టుకుని నలుగురిని అదుపులో తీసుకున్న ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కందుకూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు కందుకూర్ ఎక్స్ రోడ్ సమీపంలోని హోండా షోరూమ్ పక్కన ఉన్న ఒక గదిపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారి వివరాలు వరుసగా మహమ్మద్ చోటు,(20 సంవత్సరాలు), షేక్ రాజు (46 సంవత్సరాలు), మహమ్మద్ ఆలం (36 సంవత్సరాలు), మహమ్మద్ రెహన్,(20 సంవత్సరాలు) గా గుర్తించారు, వీరందరు బిహార్ రాష్ట్రం, భగల్‌పూర్ జిల్లా,పిర్‌పింటి ప్రాంతానికి చెందినవారుగా తెలియజేశారు నిందితుల వద్దనుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీస్ కస్టడీలో ఉంచి, ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై డయల్ 100 కు కాల్ చేసి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కందుకూర్ పోలీసులు కోరుతున్నారు.
Read also : డబ్బులు వృధా చేయకండి రా నాయనా.. ఈ ట్రిక్స్ పాటించండి?
Read also : భారీ సెక్యూరిటీతో అదే లుక్ లో మరోసారి ఈవెంట్ లో మెరిసిన నిధి అగర్వాల్?





