Tuesday, February 24, 2026
Homeజాతీయంవయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్లు.. యువత అలర్ట్!

వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్లు.. యువత అలర్ట్!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల క్యాన్సర్లు మనుషులను వెంటాడుతున్నాయి. వెయ్యి మందిలో కనీసం పదిమందికైనా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ల బారినపడి ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు. కేవలం పెద్ద వయస్సు ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా యువతలోనూ ఈ క్యాన్సర్ల ముప్పు ఉండడం ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతుంది. అయితే తాజాగా హార్డ్వార్డ్ స్టడీ చేసిన సర్వేలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. యువత “యంగ్ అండ్ ఫిట్” గా ఉన్నా కూడా కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది. వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ ఆరు రకాల క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తున్నాయి అని ఈ హార్వార్డ్ స్టడీ కీలక హెచ్చరికలు చేసింది.

6 రకాల క్యాన్సర్లు
1. కొలొరెక్టల్
2. సర్వైకల్
3. క్లోమ
4. ప్రోస్టేట్
5. కిడ్నీ క్యాన్సర్
6. మల్టిపుల్ మైలోమా

పైన పేర్కొన్న ఈ ఆరు రకాల క్యాన్సర్లు యువతను వెంటాడుతున్నాయి అని తెలిపారు. ఒబిసిటీ, పొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది ఇటువంటి క్యాన్సర్లకు ప్రధాన కారణాలు అని తెలిపారు. మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము అని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కచ్చితంగా ఏదో ఒక రోజు బాధపడాల్సి వస్తుంది అని పేర్కొన్నారు. కాబట్టి అన్ని అపోహాలు పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయించుకోవాలి అని.. అలా కాకపోతే వ్యాధి ముదిరి మరణాల రిస్క్ కూడా భారీగా పెరుగుతుంది అని తేలింది.

NCERT: ఇకపై 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అంశం

రేపు పరీక్ష రాసే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments