Monday, February 16, 2026
HomeతెలంగాణNalgonda Mayor: నల్లగొండ మేయర్ గా బుర్రి చైతన్య ప్రమాణం, కొలువుదీరిన కొత్త పాలకవర్గం!

Nalgonda Mayor: నల్లగొండ మేయర్ గా బుర్రి చైతన్య ప్రమాణం, కొలువుదీరిన కొత్త పాలకవర్గం!

క్రైమ్ మిర్రర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. నల్లగొండ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా 18 మున్సిపాలిటీల్లో చైర్మెన్, వైస్ చైర్మెన్ ల ఎంపిక పూర్తయ్యింది.

నల్లగొండ మేయర్ గా బుర్రి చైతన్య ఏకగ్రీవం

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. మేయర్ పదవికి చైతన్య పేరును కార్పొరేటర్ పెరిక స్వాతి సూచించారు. మరో కార్పొరేటర్ అల్లి సుభాష్ బలపరిచారు. బరిలో చైతన్య మినహా ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ ప్రకటించారు. అనంతరం  డిప్యూటీ మేయర్‌గా అష్రాఫ్‌ అలీ ప్రమాణం చేశారు. ఎన్నిక అంతా ప్రశాంత వాతావరణంలో జరిగింది. నల్గొండ నగర పాలక సంస్థలో 48 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ 27 డివిజన్లలో విజయం సాధించింది. ఆలిండియా ఫార్వర్డ్‌ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. దీంతో మొత్తం 30 మంది సభ్యులు అయ్యారు. ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణం స్వీకారం చేశారు.

నల్లగొండ 8వ డివిజన్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వజ్జ సంతోషి రమేష్ ను అభినందిస్తున్న మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ 9వ డివిజన్ కార్పొరేటర్ గా BRS పార్టీ నుంచి గెలుపొందిన బాణావత్ దీప్లా నాయక్

నల్లగొండ జిల్లా:

1.నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ గా అష్రఫ్ అలీ ప్రమాణం చేశారు.

2.మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా చిలుకూరు సుధ, వైస్ చైర్ పర్సన్ గా శిరీష్ ప్రమాణం చేశారు.

3.చిట్యాల: చైర్ పర్సన్ గా పందిరి గీత, వైస్ చైర్ పర్సన్ గా గుండెబోయిన శ్రీలక్ష్మి ప్రమాణం చేశారు.

4.దేవరకొండ:  చైర్ పర్సన్ గా పున్న శైలజ, వైస్ చైర్ పర్సన్ గా జుబూరా తబ్సుమ్ ప్రమాణం చేశారు.

5.చండూరు: చైర్మెన్ గా కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మెన్ గా దశరథ ప్రమాణం చేశారు.

  1. హాలియా: చైర్మెన్ గా చింతల రామచంద్రారెడ్డి, వైస్ చైర్మెన్ గా రాజా రమేష్ ప్రమాణం చేశారు.

7.నందికొండ: చైర్ పర్సన్ గా గౌతమి,  వైస్ చైర్మెన్ గా రాజా ప్రసాద్ ప్రమాణం చేశారు.

నల్లగొండ 10వ డివిజన్ కార్పొరేటర్ గా AIFB పార్టీ నుంచి గెలుపొందిన పిల్లి కృష్ణమ రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా:

1.భువనగిరి: చైర్ పర్సన్ గా తంగళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్ పర్సన్ గా పోతంశెట్టి మంజుల ప్రమాణం చేశారు.

2.యాదగిరిగుట్ట: చైర్మెన్ గా గుండ్లపల్లి భరత్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ గా బరిగె రమ్య ప్రమాణం చేశారు.

3.చౌటుప్పల్: చైర్ పర్సన్ గా మోదుగాల పావని, వైస్ చైర్మెన్ గా గోశిక వినయ్ ప్రమాణం చేశారు.

4.భూదాన్ పోచంపల్లి: చైర్మెన్ గా తడక వెంకటేష్ ప్రమాణం చేశారు.

5.ఆలేరు: చైర్ పర్సన్ గా బాలామణి, వైస్ చైర్మెన్ గా ఇంగడి ఆంజనేయులు ప్రమాణం చేశారు.

6.మోత్కూరు: చైర్ పర్సన్ గా గడ్డం స్వప్న, వైస్ చైర్మెన్ గా పల్లెర్ల వెంకన్న ప్రమాణం చేశారు.

సూర్యాపేట జిల్లా:

1.సూర్యాపేట: చైర్ పర్సన్ గా నివేదిత, వైస్ చైర్మెన్ గా ఎండీ షఫీ ఉల్లా ప్రమాణం చేశారు.

2.కోదాడ: చైర్మెన్ గా వెంకటరత్నం, వైస్ చైర్ పర్సన్ గా దేవరపల్లి మల్లీశ్వరి ప్రమాణం చేశారు.

3.హుజూర్ నగర్: చైర్మెన్ గా డొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మెన్ గా తన్నీరుఉ మల్లిఖార్జున్ ప్రమాణం చేశారు.

4.నేరేడుచర్ల: చైర్మెన్ గా కొణతం చిన వెంకట్ రెడ్డి, వైస్ చైర్మెన్ గా నూకల సందీప్ రెడ్డి ప్రమాణం చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments