క్రైమ్తెలంగాణ

27 ఏళ్ల మహిళ దారుణ హత్య..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: నిర్మల్ జిల్లా భైంసాలో 27 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురికావడం తో కలకలం రేగింది.భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో ఉన్న నందన టీ పాయింట్‌లో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. స్తనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

మృతురాలి పేరు అశ్విని (30), కుంసర గ్రామానికి చెందిన ఆమె భర్తతో విడాకులు తీసుకుని ఉపాధి కోసం టీ పాయింట్‌ను నడుపుతు  ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నగేష్ అనే వ్యక్తితో అశ్వినికి పరిచయం ఏర్పడి, కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

అశ్విని తనతో ఉంటూనే మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతుందని నగేష్ అనుమానించాడు. ఈ అనుమానంతోనే అతను టీ పాయింట్‌లో ఆమెను కత్తితో పొడిచి, రాడ్డుతో దాడి చేసి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. నగేష్ హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోకుండా మృతదేహం పక్కనే కూర్చున్నాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button