- సీఎంగా ఉన్న కాలంలో కేసీఆర్ ఫాం హౌజ్‌కే పరిమితం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
మెదక్,క్రైం మిర్రర్ః
కాలేశ్వరం కాలువల నిర్మాణం పేరుతో లక్షల కోట్లరూపాయలను దోచుకు తిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
మెదక్ జిల్లా రామయంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోభాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫాం హౌజ్‌కే పరిమితమయ్యాడని మండిపడ్డారు.
ఎంపీ, ఎమ్మెల్సీ బీఆర్ ఎస్ సీటు కూడ గెలవలేదని ఎద్దేవాచేశారు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను విక్రయించి డబ్బలు దోచుకుంటుందని ఆరోపించారు.
అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టుతో రైతులకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు.
బీఆర్ ఎస్ నాయకులు బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా ఉన్న పద్మదేవేందర్ రెడ్డి రామాయంపేటకు ఎలాంటి అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





