బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

పటాన్ చెరు,క్రైమ్ మిర్రర్:- మున్సిపల్ ఎన్నికల్లో బీఅర్ఎస్ కు ఓట్లడిగే నైతిక హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం ముగిసే సమయానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఅర్ఎస్,బీజేపీ పార్టీలపై విమర్శల బాణాలు సంధించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. సర్వేలన్ని కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంపూర్ణ మద్దతుతో రాష్ట్రంలో మెజార్టీ మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
India vs Pakistan T20: వెనక్కి తగ్గిన పాకిస్తాన్, భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అంగీకారం!
Epstein Files Rock Europe: యూరప్‌లో ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు, బ్రిటన్ ప్రధాని రాజీనామా?









