Homeతెలంగాణబడంగ్‌పేట్ మున్సిపాలిటీలో ఏసిపి, టిఫిఓ లపై వసూళ్ల ఆరోపణలు..!

బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో ఏసిపి, టిఫిఓ లపై వసూళ్ల ఆరోపణలు..!

  • బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో ఏసిపి, టిఫిఓ లపై వసూళ్ల ఆరోపణలు..!

  • బిల్డింగ్ పర్మిషన్లు, ఓసి కోసం వస్తే ఇబ్బందులేనా..?

  • సైట్ ఇన్‌స్పెక్షన్ల పేరుతో బెదిరింపులు.. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ బాధితుల ఆవేదన!

బడంగ్‌పేట్, క్రైమ్ మిర్రర్: రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ మున్సిపాలిటీలోని ఏసిపి (ACP), టిఫిఓ (TPO) అధికారుల తీరుపై కొందరు బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) కోసం సైట్ ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన అధికారులు ఏవో కారణాలు చూపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి, వాస్తవాలను వెల్లడించాలని బాధితులు కోరుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

గమనిక: ఈ వార్తలో పేర్కొన్న అంశాలు బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కొందరు బాధితులు చేసిన ఆరోపణలు, వారు వ్యక్తం చేసిన ఆవేదన ఆధారంగా రూపొందించబడ్డాయి. ఏసిపి (ACP), టిఫిఓ (TPO) అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు స్వతంత్రంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ కథనం ద్వారా ఎవరి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు. ప్రజలకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నాం. సంబంధిత అధికారుల వివరణ లేదా స్పందన అందిన పక్షంలో దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు