
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అనటువంటి హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రి సత్యనారాయణ రావు తుది శ్వాస విడిచారు. వయోభారం, కొన్ని అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగానే ఈ తెల్లవారుజామున ఉదయం మరణించారు అని తెలిపారు. కాగా హరీష్ రావు తండ్రి పుట్టింది పెరిగింది మొత్తం కరీంనగర్ జిల్లానే. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో హరీష్ రావు తండ్రి నివాసం ఉండేవారు. ఇప్పటికే హరీష్ రావు తండ్రి మృతి పట్ల కెసిఆర్ మరియు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా… బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా నేడు తన ఇంటికి చేరుకొని నివాళులు అర్పించనున్నారు. కాగా రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి తన తండ్రి వెనక ఉండి ఎంతో ప్రోత్సాహం అందించారు అని తోటి సన్నిహితులు చెబుతూ ఉన్నారు. సత్యనారాయణ మరణ వార్త వినగానే పెద్ద ఎత్తున టి
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడా ఒకసారిగా షాకు కు గురయ్యారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు అలాగే ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి పయనమయ్యారు. ఇటువంటి విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read also : ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ.. వనపర్తి మునిసిపాలిటీకి రూ.18.70 కోట్ల యూఐడిఫ్ నిధులు!
Read also : భార్య కాపురానికి రావడం లేదని పెట్రోల్ పోసుకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతి





