
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణించారు అని.. ఆ తర్వాత అవన్నీ కూడా ఫేక్ వార్తలు అని తన కుమార్తె ఈశా డియోల్ ప్రకటించడం ఇవన్నీ సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. అయితే తాజాగా నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో పోరాడుతున్నటువంటి ధర్మేంద్ర ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ లో చేరిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించారు అని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి. కానీ నేడు వైద్యులు అందించిన చికిత్సకు త్వరగా కోలుకున్నారు అని.. అందుకే ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచినటువంటి ఈ ఫేక్ వార్తలు ఇంతటితో ముగిసాయి. హ్యాపీగా ధర్మేంద్ర తన ఇంటికి చేరుకున్నారు. కాగా మరోవైపు సీనియర్ నటుడు గోవింద కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో కుప్ప కూలిపోయాడని.. వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అని వార్తలు వచ్చాయి.
Read also : నటుడు నాగార్జున,అతని కుటుంబానికి క్షమాపణలు-మంత్రి కొండా సురేఖ
Read also : ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు బిగ్ షాక్.. పరీక్షలు నిర్వహించలేమంటున్న విద్యాశాఖ?





