-
ఈ నెల 7, 8 పవన్ ప్రచారం
-
బీజేపీ నాయకుల్లో ఉత్సాహం
హైదరాబాద్,క్రైం మిర్రర్:
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలో త్వరలోజరుగనున్న నేపథ్యంలో బీజేపీ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ మేరకుకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావులు పవన్‌కళ్యాణ్‌ను ఆయన నివాసంలో కలిసి మున్సిపల్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.
దీంతో ప్రచారంలో పాల్గొనాలని కోరగా దానికి ఆయన ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 7, 8తేదీల్లో తెలంగాణలో ప్రచార కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నారామచందర్‌రావు తెలిపారు. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో సహా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగాచర్చలు జరిపామన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.
బీజేపీ, జనసేన పార్టీస్నేహపూర్వకపోటీ అంటూ ట్వీట్…
ఇదిలా ఉండగా ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా బీజేపీ, జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేయడం కొసమెరపు.





