HomeజాతీయంMumbai Mayor Ritu: 44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీజేపీ, బీఎంసీ మేయర్‌గా రీతూ...

Mumbai Mayor Ritu: 44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీజేపీ, బీఎంసీ మేయర్‌గా రీతూ తావ్‌డే!

Ritu Tawde Elected Mumbai Mayor: సుమారు 44 ఏళ్ల తర్వాత ముంబై మేయర్‌ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) 78వ మేయర్‌గా ఆ పార్టీకి చెందిన రీతూ తావ్‌డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమలం పార్టీ మొదటిసారిగా 1982-83లో ఈ పదవిని దక్కించుకోగా, మళ్లీ ఇన్నేళ్లకు ఆ అవకాశం లభించింది.

ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెర

రీతూ తావ్‌డేతో పాటు శివసేన అభ్యర్థి సంజయ్‌ ఘాడీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో గత 25 ఏళ్లుగా ముంబై రాజకీయాలను శాసిస్తున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. జనవరి 15న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం 29 స్థానాలను దక్కించుకుంది. ఈక్రమంలో అధికార కూటమి మేజిక్‌ ఫిగర్‌ 114ను దాటి అధికారాన్ని చేజిక్కించుకుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments