
క్రైమ్ మిర్రర్ ,వేములపల్లి:- నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గౌరోజు అశోక్ ఇటీవల అనారోగ్యానికి గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామ ప్రజలు,సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు పేరబోయిన సైదులు, మానుపూరి పురుషోత్తం,షేక్ జానీ ఆస్పత్రికి చేరుకొని అశోక్ ను పరామర్శించారు. అనంతరం డాక్టర్లను కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అశోక్…ఆరోగ్య యోగక్షేమాలు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.