
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే విధించగా సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి… అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. అయితే తాజాగా బీసీ రిజర్వేషన్లను బిజెపి నే అడ్డుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఈ బీసీ రిజర్వేషన్ల గురించి అఖిలపక్షంతో ప్రధానమంత్రిని కలవాలనుకున్నాం. కానీ ప్రధానమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికి కూడా మేము ప్రధానిని కలవడానికి సిద్ధంగా ఉన్నాము. రామచంద్ర రావు అలాగే ఎవరైతే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానితో మాట్లాడి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఖచ్చితంగా కలుస్తామని చెప్పుకొచ్చారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఈ బంద్ బిజెపికి వ్యతిరేకంగానే జరుగుతుంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను కొంతమంది న్యాయానిపుణులతో చర్చించి ఆ తరువాతనే ఎన్నికలపై తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : నాలుగు సార్లు వచ్చినా… జగన్ పేరే ఎత్తలేదు!.. కారణం ఏంటో తెలుసా?
Read also : “తెలుసు కదా”.. ఆహా మరో హిట్ అయ్యిందా?.. రివ్యూ ఇదే!