-
ఎక్కువ ఓట్లు సీట్లు సాధించుకోగలిగాం
-
కరీంనగర్, నిజామాబాద్ కైవసం చేసుకుంటున్నాం
-
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: న్సిపల్ ఎన్నికల్లో భాజపా బలపడిందని ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణనీయంగా ఓట్లు సాధించామని, పలుచోట్ల సీట్లు గెలిచామని అన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 6 మున్సిపాలిటీల్లో భాజపా నిలిచింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకో బోతున్నాం. నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్‌లో మా పార్టీ అభ్యర్థులే ఛైర్మన్లు అవుతారు. ఎక్స్ అఫిషియో, స్వతంత్రుల మద్దతుతో ఛైర్మన్ పదవులు దక్కించుకుంటాం అని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భాజపా ఆశించిన మేరకే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదన్నారు. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 350 సీట్లు గెలుస్తున్నాం. త్రిముఖ పోరులో భాజపాకు కొంత నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక డివిజన్, అశ్వారావుపేటలో ఒక వార్డు గెలిచాం. అధికార పార్టీ కాంగ్రెస్‌కు అనుకున్న సీట్లు రాక అనేక చోట్ల హాంగ్ వచ్చిందన్నారు. భాజపాను ఓడించడానికి కాంగ్రెస్, బీఆరఎస్, మజ్లీస్ కలిసి పని చేశాయని అందుకే బీఆరఎస్ ఇన్ని సీట్లు గెలవగలిగిందన్నారు. హాంగ్ వచ్చిన చోట భాజపా ఎవ్వరికీ మద్దతు ఇవ్వదు. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో భాజపా బలంగా ఉంది. తెలంగాణ ప్రజలు భాజపాను విశ్వసిస్తున్నారు. కచ్చితంగా అధికారంలోకి వస్తాం. మేం ఎవ్వరికీ మద్దతు ఇవ్వం. కానీ మాకు ఎవరైనా మద్దతు ఇస్తామంటే తీసుకుంటాం అని రామచందర్‌రావు తెలిపారు. భవిష్యత్ ఎన్నికల్లో మరింతగా ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు.









