
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-రాహుల్ గాంధీ ఈమధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఓట్ల చోరీ జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న సందర్భంలో బీజేపీ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తాజాగా హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అవి నిరాధార, అసత్య ఆరోపణలు అని అంటూ.. దేశాన్ని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు అని తీవ్రంగా విమర్శించింది. రాహుల్ గాంధీ కావాలనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని తెలిపింది. నీకు ఓట్ల చోరీపై నిజంగా అవకతవకలు జరిగాయని అనిపిస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ను లేదా కోర్టును ఆశ్రయించాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి అని సూచించారు. కోర్టును లేదా ఎలక్షన్ కమిషన్ ను కలిస్తే నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి కదా.. కానీ రాహుల్ గాంధీ మాత్రం అలాంటివి చేయరు అని బిజెపి కౌంటర్లు వేసింది . అంతేకాకుండా రాహుల్ గాంధీ భారతదేశానికి వ్యతిరేక శక్తులతో కలిసి దేశంలో ఆటలు ఆడుతున్నారు అని మరోవైపు కేంద్ర మంత్రి రిజిజు ఫైరయ్యారు. కాగా హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీతో పాటు అక్కడ 12.5% ఓట్లు నకిలీవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
Read also : మరి కాసేపట్లో అద్భుతం జరగనుంది.. ” 6.49 ” ఈ టైం గుర్తుపెట్టుకోండి..?
Read also : హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్





