Homeఆంధ్ర ప్రదేశ్బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఈ రెండు జిల్లాలలో బర్డ్ ఫ్లూ కారణంగా వందలాది కోళ్లు చనిపోవడంపై ఈ మధ్య అధికారులు కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించగా వ్యాది కారణంగానే చనిపోయాయని నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగానే తాజాగా ఈ రెండు జిల్లాలలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. పది రోజుల క్రిందట వరకు కూడా కేజీ చికెన్ ధర 300 రూపాయలకు పైగా అనే పలకగా ప్రస్తుతం 160 నుంచి 180 రూపాయలు పలుకుతుంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ వ్యాధి ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదు అని అధికారులు ప్రజలకు వివరిస్తున్న కూడా ప్రజలు భయపడుతూనే ఉన్నారు. చికెన్ మరియు కోడిగుడ్లను 100° లకు పైన వేడిచేసి ఉడికించి తింటే ఎటువంటి ప్రమాదం ఉండదు అని తేల్చి చెప్పిన కూడా ప్రజలు తినడానికి ముగ్గు చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ రెండు జిల్లాలలో మాత్రం చికెన్ ధరలు మరింత పతనమయ్యాయి. గత కొద్ది రోజుల క్రితమే మంత్రి అచ్చన్నాయుడు కూడా ఈ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ఏదైనా సంఘటన ద్వారా అసాధారణ రీతిలో పక్షులు లేదా జంతువులు మరణిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి అని సూచించారు.

కడప, బెంగళూరు కొత్త రైల్వే లైన్

Single Post Template – Default PRO

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments