
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కాలేజీలు ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని నిరసన చేస్తూ బంద్ నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాదాపు నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఈ బంద్ కొనసాగగా ఆ తర్వాత ప్రభుత్వం బకాయిల్లో 1200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇవ్వగా వెంటనే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బందును విరమించాయి. అయితే ఇదే బంద్ సమయంలో రాష్ట్రంలో జరగాల్సినటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి మళ్లీ తిరిగి నిర్వహించలేము అని.. సప్లమెంటరీ రాసుకోవాలని విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. దీంతో అన్ని ప్రైవేట్ కాలేజీలలో విద్యార్థులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తామని FATHI స్పష్టం చేసింది. ఏది ఏమైనా కూడా ప్రైవేట్ కాలేజీలలో యాజమాన్యాలును నమ్మి బందులో పాల్గొన్న విద్యార్థులకు చివరికి పరీక్షల విషయంలో గట్టిగానే షాక్ తగిలింది.
Read also : ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రళయతాండవం.. మన దేశంలోనే 80వేల మంది మృతి!
Read also : నిన్న విజయ్ దేవరకొండ.. నేడు ప్రకాష్ రాజ్.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ?





