ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో భాగంగా నేడు సిడ్నీ సిక్సర్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగానే మెల్బోర్న్ స్టార్స్ టీం కు చెందిన బెన్ డకెట్ ఒకే ఓవర్ లో వరుసగా 6 ఫోర్లను బాదాడు. అఖిల్ హుస్సేన్ వేసిన నాలుగో ఓవర్ లో వరుసగా ఆరు బంతులను 6 బౌండరీలుగా బెన్ డకెట్ మలిచాడు.
ఎయిర్టెల్ సేవలకు అంతరాయం!… అసహనానికి గురైన యూజర్లు?
ప్రజలకు ఇస్తానన్న హామీలేవీ రేవంత్?… ప్రజల్ని నిండా ముంచినావ్!
ఇక ఈ మ్యాచ్ లో బెన్ డకెట్ కేవలం 29 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. రెండు సిక్స్ లు, 10 ఫోర్లు తో మొత్తంగా 68 పరుగులు చేసాడు. దీంతో మెల్బోర్న్ స్టార్స్ టీం 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి ప్లేయర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్సోల్డ్ గా మిగలడం ఏంటని ఈ ప్లేయర్కు చాలామంది నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా అఖిల్ హుస్సేన్ వేసినటువంటి ఓవర్ లో డకేట్ తన విధ్వంసంతో బౌలర్కు చుక్కలు చూపించాడు.