టీం ఇండియా వరస మ్యాచ్లు ఓడిపోవడంతో బీసీసీఐ క్రికెట్ ప్లేయర్స్ పై కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. జట్టులో ఉన్నటువంటి VVIP కల్చర్ను తగ్గించేందుకు ఇకపై అందరూ కూడా టీం బస్సుల్లోనే ప్రయాణించాలని ఆదేశించింది. భార్య పిల్లలతో కలిసి ఉండడానికి చిన్న టోర్నీ మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే ఉండాలని తెలిపింది. తాజాగా ఏడు రోజులు చిన్న లీగ్ మ్యాచ్లు ఉన్నప్పుడు అలాగే పెద్ద టోర్నీ మ్యాచ్లు ఉన్నప్పుడు 14 రోజులకు కుదించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఆటగాళ్ల బ్యాగేజ్ అనేది 150 కేజీల కన్నా ఎక్కువగా ఉండకూడదని ఆంక్షలు విధించినట్లు సమాచారం అందింది.
సైఫ్ అలీ ఖాన్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు?
అయితే తాజాగా క్రికెటర్లపై బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించడం వెనుక తీవ్ర కారణాలు ఉన్నట్లు TOI వెల్లడించింది. ఆస్ట్రేలియా టూర్ లో ప్లేయర్లు గ్రూపులుగా విడిపోయి ట్రావెల్ చేశారట. దీంతో జట్టు బాండింగ్ అనేది చాలా మిస్ అయిందని, దీని కారణంగానే ప్రస్తుతం బీసీసీఐ కొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది. చాలామంది ప్లేయర్లు కుటుంబాలతో హోటల్లో స్టే చేస్తున్నారట. ఆఖరికి టీమిండియా కోచ్ గంభీర్ కూడా క్రికెటర్లతో కాకుండా తన సొంత స్నేహితులతో బయటకు వెళ్తుండడంతో బిసిసిఐ ఈ చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు.