స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్ ఇచ్చిన BCCI

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత దిగ్గజ క్రికెట్ ప్లేయర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఈ స్టార్ ప్లేయర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ 2025-26 విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటివరకు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ A+ క్యాటగిరిలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరినీ గ్రేడ్-B లోకి చేర్చుతూ బీసీసీఐ ఒక కీలక ప్రకటన చేసింది. కాగా ఇప్పటికే రోహిత్,విరాట్ కోహ్లీ టీ20 మరియు టెస్ట్ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా కేవలం వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నారు. అందుకే వీరిద్దరినీ A+ కేటగిరీలోంచి తొలగిస్తూ B గ్రేడ్ లోకి చేర్చింది. ఇక మరోవైపు బుమ్రా, గిల్ మరియు జడేజా మాత్రమే ప్రస్తుతం ఏ గ్రేడ్ లో ఉన్నారు. కానీ రోహిత్ మరియు విరాట్ కోహ్లీ లాగా జడేజా కూడా కేవలం టి20 అనే ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడుతుండగా అతనిని మాత్రం A గ్రూపులో ఉంచడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. దీంతో రోహిత్ విరాట్ కోహ్లీలో శాలరీలు కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం వీరిద్దరి అభిమానులకు కాస్త నిరాశపరుస్తుంది.
క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట నిఘా : బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
నిఘా నేత్రాల నీడలో పోలింగ్.. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి









